OG : నైజాంలో రికార్డు స్థాయిలో ‘ఓజీ’ రైట్స్ ..?
OG : సినీ రంగానికి అత్యంత కీలకమైన నైజాం(Nizam Rights)లో ‘ఓజీ’ హక్కుల కోసం భారీ పోటీ జరుగుతోందట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఈ సినిమాకు ఏకంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి
- By Sudheer Published Date - 04:55 PM, Tue - 3 June 25

రన్ రాజా రన్, సాహో (Run Raja Run, Saahoo) సినిమాలతో టాలెంట్ చూపించిన దర్శకుడు సుజిత్ (Sujeeth ), ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను హీరోగా తీసుకుని ఓ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ ‘ఓజీ’(OG). పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, టీజర్‌కు వచ్చిన అద్భుత స్పందనతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
IPL 2025 Final : అహ్మదాబాద్‌లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సినీ రంగానికి అత్యంత కీలకమైన నైజాం(Nizam Rights)లో ‘ఓజీ’ హక్కుల కోసం భారీ పోటీ జరుగుతోందట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఈ సినిమాకు ఏకంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే ఇప్పటి వరకు నైజాంలో జరిగిన అత్యధిక బిజినెస్ గల సినిమా ఇదే అవుతుంది. ఈ భారీ బిజినెస్ నేపథ్యంలో పవన్ ప్రభావాన్ని మరోసారి సినీ పరిశ్రమలో స్పష్టంగా చూపిస్తోందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ ఉండగా, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌కు మాత్రమే రూ.100 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న విడుదలవుతుండగా, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా జూన్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులు చేయడం పవన్ కెరీర్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం.