Jr NTR : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న జూనియర్ ఫోటో
ఒక గంట వ్యవధిలో వైరల్ అయిన ఫోటో ఇప్పుడు అన్నీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
- By CS Rao Published Date - 03:12 PM, Wed - 24 August 22

ఒక గంట వ్యవధిలో వైరల్ అయిన ఫోటో ఇప్పుడు అన్నీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ట్బిట్టర్‌లో పోస్ట్ అయిన ఈ ఫొటోకు లైకులు, రీ ట్వీట్ల హోరు మామాలుగా లేదు. ఈ ఫొటోపై కామెంట్లు, కౌంటర్ కామెంట్లు ఓ రేంజిలోకి వెళుతున్నాయి. ఈ ఫొటోను నందమూరి, కొడాలి, వల్లభనేని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాలుమీద కాలువేసి కొడాలి నాని మీద స్టైల్ గా కూర్చొన్న ఫోటో అది. 2014, 2019 ఎన్నికల్లో గవన్నరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం వైసీపీకి సన్నిహితంగా మెలగుతున్న వల్లభనేని వంశీ మోహన్ కూడా పక్కన ఉన్నారు. కొడాలి నాని కాలిపై దర్జాగా కాలువేసి జూనియర్ కూర్చున్న భంగిమ భలే వైరల్ అవుతోంది. జూనియర్ కాలువేస్తే అదేమీ పట్టనట్టు కొడాలి నాని ఏదో పుస్తకంలోనో, నోట్స్‌లోనే లీనమైనట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరునవ్వులు చిందిస్తున్నారు.
Unseen Pic Of @tarak9999 💥#ManOfMassesNTR pic.twitter.com/1WXvoKsXVC
— NTR Trends (@NTRFanTrends) August 24, 2022
ముగ్గురూ ఒకప్పుడు చాలా సన్నిహితంగా మెలగేవారు. జూనియర్ ఎన్టీఆర్‌తో రెండు, మూడు సినిమాలకు వంశీ నిర్మాతగా వ్యవహరించారు. కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను నిర్మించారు. పరిటాల రవి, నందమూరి హరికృష్ణ అంటే వీరిద్దరికీ ఎనలేని అభిమానం. హరికృష్ణ వచ్చారంటే నాని గానీ, వంశీ వెన్నంటే నడిచేవారని ఫ్యాన్స్ చెప్పుకుంటారు. నాని, వంశీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒకప్పుడు కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
అమిత్ షా, జూనియర్ భేటీ తరువాత ఆయన రాజకీయ ప్రవేశంపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పాత జ్ఞాపకాలతో కూడిన ఫోటో బయటకు రావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.