Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ.. రాజమౌళి, త్రివిక్రమ్ సహా పలువురు హాజరు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..!
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. దీంట్లో టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ పాల్గొన్నారు.
- Author : Gopichand
Date : 13-04-2023 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) బుధవారం రాత్రి తన ఇంట్లో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. దీంట్లో టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ పాల్గొన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపానని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ 30లో హాలీవుడ్ టెక్నీషియన్స్ జాయిన్ అయ్యారు. అందులో అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ వైస్ చైర్మెన్ జేమ్స్ కూడా ఉన్నారు. ఆయనకు ఫెర్వెల్ కోసం ఎన్టీఆర్ తన ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023
ఈ పార్టీ కోసం ఎన్టీఆర్ 30 టీమ్ తో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ పార్టీకి కొరటాల టీమ్ తో పాటు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మైత్రీమేకర్స్ కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో ఎన్టీఆర్ వైఫ లక్ష్మీ ప్రణీత కూడా పాల్గొన్నారు. నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు ఓ నోట్ కూడా రాశాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఈ సాయంత్రం చక్కగా గడిపాను. ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. మీ మాటను నిలబెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్.. ఈ పార్టీలో మాతో పాటు జాయిన్ అయినందుకు మా విందు అందుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Also Read: Shriya Saran: తన బోల్డ్ లుక్స్ తో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న శ్రియా శరణ్
ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్30 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేయబోతున్నాడు. వీటితో పాటు హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో వార్ 2లో కనిపిస్తాడని ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తోంది.