Niveda Pethuraj : విశ్వక్ తో నటించనని చెప్పిన హీరోయిన్.. మాస్ కా దాస్ కి బిగ్ షాక్..!
Niveda Pethuraj యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుంటారు. ఐతే తన సినిమాలతో పాటుగా బయట కూడా ఎక్కువ
- By Ramesh Published Date - 10:48 AM, Fri - 28 June 24

Niveda Pethuraj యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తుంటారు. ఐతే తన సినిమాలతో పాటుగా బయట కూడా ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటాడు విశ్వక్ సేన్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో న్యూస్ లో ఉంటాడు. అది అతను కావాలని చేయకపోయినా అలా జరిగిపోతుంటాయి. ఐతే లేటెస్ట్ గా ఆ హీరోతో ఇక మీదట నటించేది లేదని చెప్పింది కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్. విశ్వక్ తో ఏకంగా 3 సినిమాల్లో నటించిన ఆమె అతనితో తనను ముడి పెడుతూ వార్తలు రాయడం గుర్తించింది.
అందుకే లేటెస్ట్ గా పరువు వెబ్ సీరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నివేదా పేతురాజ్ ని మీడియా వాళ్లు విశ్వక్ తో మళ్లీ ఎప్పుడు కలిసి చేస్తారని అడిగితే తనతో ఇక నటించనని సరదాగా చెప్పారు. మరి నివేదా సరదాగా అన్నదా లేదా నిజంగానే విశ్వక్ తో ఇక మీదట కలిసి నటించే ఆలోచన లేదా అన్నది తెలియాల్సి ఉంది.
తెలుగు, తమిళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నివేదా పేతురాజ్ అటు సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లకు ఓకే అనేస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగి. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్న నివేదా పేతురాజ్ కి ఇంకా మరిన్ని ఛాన్సులు రావాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.