Niharika: మనోజ్ మూవీలో అలాంటి పాత్రలో నిహారిక.. వామ్మో చాలా వైల్డ్ అంటూ?
- By Sailaja Reddy Published Date - 05:20 PM, Wed - 27 March 24
మెగా డాటా నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. ఈమె తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొదట యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. వరుసగా మూడు సినిమాలలో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కకపోవడంతో సినిమాలు మానేసి ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. కానీ మ్యారేజ్ లైఫ్‌సెట్ కాలేదు. దీంతో రెండేళ్లకి విడిపోయింది.
అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది నిహారిక. ప్రస్తుతం ఆమె రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో ప్రధానంగా మంచు మనోజ్ సినిమా ఉండటం విశేషం. వాట్ దిఫిష్ పేరుతో ఒక మూవీని ప్రకటించారు మంచు మనోజ్. ఇందులో నిహారిక కీలక పాత్రలో నటిస్తుందట. అయితే ఇందులో ఆమె పాత్రకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇందులో నిహారిక అష్టలక్ష్మి అనే పాత్రలో కనిపిస్తుందని,ఆమె యాక్షన్ కూడా చేస్తుందని, విలన్ లని తుక్కు తుక్కు చేస్తుందట. ఈ మూవీకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో పాటు మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది నిహారిక షేన్ నిగమ్ మెయిన్ లీడ్‌గా చేస్తున్న మద్రాస్ కారన్ అనే మూవీలో హీరోయిన్గా చేస్తుంది.
వాలిమోహన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలోనూ నిహారిక ఒక తమిళ సినిమా చేసింది. కానీ అది వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడైనా ఇటు తెలుగులో, అటు తమిళంలో సక్సెస్ అందుకుంటుందా అనేది చూడాలి మరి. ఇదిలా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత వైల్డ్ గా వెల్లబోతుంది నిహారిక. నిర్మాతగానూ బిజీ అవుతుంది. తాను స్థాపించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇటీవలే ఒక సినిమాని ప్రారంభించింది. ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మలయాళ లేటెస్ట్ సంచలనం మంజుమ్మల్ బాయ్స్ తరహాలో పది మందికిపైగా కుర్రాళ్లని పరిచయం చేయబోతుందట. ఇందులో పదకొండు మంది హీరోలను వెండితెరకి పరిచయం చేయబోతుందట నిహారిక. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో ఈ మూవీ రూపొందుతుందని, ఇందులో పదకొండు మంది కొత్త కుర్రాళ్లని హీరోగా పరిచయం చేస్తున్నారని, అలాగే నలుగురు అమ్మాయిలకు హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నట్టు టీమ్ నుంచి అందిన సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Related News
Naveen Chandra: నవీన్ చంద్రకు అరుదైన గౌరవం.. తెలుగు హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
Naveen Chandra: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో ఆయన నటనకు గుర్తింపు లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు పేరు మీద దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో చలనచిత్ర రంగంలో ఔన్నత్యాన్ని జరుపుకుంటుంది. ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ అ�