Niharika : ఆ టైం లో బాగా ఏడ్చాను.. డైవర్స్ రెండో పెళ్లిపై నిహారిక స్పందన..!
మెగా డాటర్ నిహారిక (Niharika) పెళ్లైన ఏడాదికే డైవర్స్ తో షాక్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత తను సినిమాలు చేస్తున్నందు వల్లే ఆమె తన భర్త చైతన్యతో విడిపోయిందని
- By Ramesh Published Date - 07:28 PM, Fri - 26 January 24
మెగా డాటర్ నిహారిక (Niharika) పెళ్లైన ఏడాదికే డైవర్స్ తో షాక్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత తను సినిమాలు చేస్తున్నందు వల్లే ఆమె తన భర్త చైతన్యతో విడిపోయిందని అనుకున్నారు. అయితే పెళ్లి తర్వాత తను సినిమాలు చేయలేని కారణాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు భర్తతో విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం వాటి గురించి స్పందించింది. లేటెస్ట్ గా ఒక పాడ్ కాస్ట్ లో ఈ విషయాల గురించి వెల్లడించారు నిహారిక.
We’re now on WhatsApp : Click to Join
పెళ్లి చేసుకున్నందు వల్లే సినిమాలు చేయలేదని అనుకున్నారు కానీ మా వృత్తి దాన్ని వదిలి పెట్టలేం. కేవలం ఆ టైం లో నిర్మాతగా బిజీగా ఉన్నందు వల్లే సినిమాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు నిహారిక. ఇక పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని అలా తెలుసుకోకపోతే మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు.
వాళ్లు మన అమ్మ, నాన్నలా ఉండరు కదా.. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి అది ఈమధ్యనే నేర్చుకున్నానని అన్నారు నిహారిక. ఇక తనది పెద్దలు కుదిర్చిన సంబంధం.. డైవర్స్ తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలు అన్నారు. ఆ టైం లో ఎంతో బాధేసింది.. చాలా ఏడ్చాను.. అది భరించడం అంత ఈజీ కాదని అన్నారు నిహారిక.
ఎవరైనా సరే జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు ఒక్క ఏడాదికే విడిపోతామని చేసుకోరు. రిలేషన్ షిప్ కొనసాగాలని అందరు కోరుకుంటారు కాని అన్నీ అనుకున్నట్టు జరగవని అన్నారు నిహారిక. నా గురించి ఏం రాసినా సరే పట్టించుకోలేదని అన్నారు.
తన డైవర్స్ టైం లో క్యారెక్టర్ ని తప్పుబట్టరు.. ఫ్యామిలీని నానా మాటలు అన్నారు. అప్పుడు తట్టుకోలేకపోయానని అన్నారు నిహారిక. తన కుటుంబం తనని ఎప్పుడు బరువు అనుకోలేదని.. ఈ రెండేళ్లలో ఫ్యామిలీ విలువ బాగా తెలిసొచ్చిందని అన్నారు. పెళ్లి విడాకుల తర్వాత ఎవరినీ నమ్మకూడదని తెలిసిందని.. లైఫ్ లో ఇదొక గుణపాఠమని అన్నారు.
Also Read : Raviteja Sitara Entertainments : రవితేజతో సితార ఎంటర్టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరు..?
ఐతే ఎప్పటికీ ఇలా సింగిల్ గా ఉండిపోను.. నాకింకా 30 ఏళ్లే.. మంచి వ్యక్తి కనిపిస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఆన్నారు నిహారిక. మళ్లీ తిరిగి కెరీర్ ప్రారంభిస్తున్న నిహారిక కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తుండగా తెలుగులో కూడా ఒక సినిమా సైన్ చేశారు.
Related News
Niharika Konidela: నిహారిక సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’, సుప్రీం హీరో చేతుల మీదుగా టైటిల్ పోస్టర్
Niharika Konidela: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. నిర్మ