Shanmukh : సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం షణ్ముఖ్ కు ఏమొచ్చింది..?
- By Sudheer Published Date - 04:35 PM, Sun - 25 February 24

గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి..బెయిల్ ఫై బయటకు వచ్చిన ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ కు సంబదించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో లో తాను సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుపడం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయినా సంగతి తెలిసిందే. తెలుగులో షణ్ముఖ్ అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. సినీ హీరోలకు మించి ఇతడికి అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవాలి ఆయన ఎన్త పాపులరో. అలాంటి షణ్ముఖ్ .,.గంజాయి తో పట్టుబడడం అందర్నీ షాక్ కు గురి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
షణ్ముక్ (Shanmukh Jaswanth ) అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై మౌనిక అనే యువతీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. పోలీసులు అక్కడ తనిఖీలు జరుపగా… అక్కడ షణ్ముఖ్ గంజాయి (Ganja )తో అడ్డంగా బుక్కయ్యాడు. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ రచ్చ చేశాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. షణ్ముఖ్ ను బయటకు తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటె తాజాగా సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ పోలీసులతో ఏడుస్తూ మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. ఇందులో వెనుక నుంచి కనిపిస్తోన్న అతడు.. ఎదురుగా ఉన్న వాళ్లతో ‘చూడండి.. మీరే చూడండి. నేను చాలా రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నాను. సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నా’ అని చెబుతున్న మాటలు వినిపించాయి. అలాగే తాను గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నాడని కూడా అంటున్నారు. ఇందులో అది స్పష్టంగా కనిపించకున్నా పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాత్రం చాలా నిజాలు ఒప్పుకున్నాడని అంటున్నారు. అసలు షణ్ముఖ్..ఎందుకు గంజాయి అలవాటు చేసుకున్నాడు..? అసలు షణ్ముఖ్ ను సూసైడ్ చేసుకోవలసిన అవసరం ఏముంది..? అని అంత మాట్లాడుకుంటున్నారు.
E Shanmukh gadu okadu pic.twitter.com/9QCLX65bYe
— Satyajith (@satyajithpinku) February 25, 2024
Read Also : Expenditure Survey : ఆహారం కంటే వినోదానికే ఎక్కువ ఖర్చు.. గృహ వినియోగ వ్యయ సర్వే విశేషాలు