1000 Wala Movie : త్వరలో పేలనున్న 1000 వాలా.. మరో కొత్త హీరో..
అమిత్ అనే మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.
- By News Desk Published Date - 08:34 PM, Sat - 8 February 25

1000 Wala Movie : తెలుగులో ఇటీవల కొత్త హీరోలు, నటీనటులు చాలా మందే పరిచయం అవుతున్నారు. ఇప్పుడు అమిత్ అనే మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై షారుఖ్ నిర్మాణంలో అఫ్జల్ దర్శకత్వంలో అమిత్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న సినిమా 1000 వాలా. సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
1000 వాలా సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. నాలుగు ఎనర్జిటిక్ పాటలు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేసి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనుంది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది.
ఈ సినిమా దర్శక నిర్మాతలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మా 1000 వాలా సినిమా టీజర్ సోషల్ మీడియాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరించి హిట్ అవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని తెలిపారు.
Also Read : Siddharth : అభిమానులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు