Nayanatara: తల్లి అయిన నయనతార…ఫొటోలను షేర్ చేసిన విఘ్నేష్..!!
పెళ్లయిన నాలుగ నెలలకే సౌత్ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యింది. నయనతార కవలతో ఉన్నఫొటోలను భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ...అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు.
- Author : hashtagu
Date : 09-10-2022 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
పెళ్లయిన నాలుగ నెలలకే సౌత్ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యింది. నయనతార కవలతో ఉన్నఫొటోలను భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ…అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. ఆ ఫొటోల్లో నయనతార, విఘ్నేష్ ఇద్దరు చిన్నారుల పాదాలను ముద్దు పెట్టుకుంటున్నారు.
ఇద్దరు చిన్నారుల పాదాలను ముద్దు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ నయన్ నేను ఈ రోజు అమ్మ, అప్పగా మారాము. మాకు కవల కుమారులు ఉన్నారు. మీ అందరి ప్రార్థనలతో మా పూర్వీకుల ఆశీర్వాదంతో మేము మా ఇద్దరి పిల్లల రూపంలోకి వచ్చాము. మీ అందరి ప్రార్థనలు మాకు కావాలి. ఉయిర్, ఉల్గామ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
అయితే గతకొంతకాలంగా నయనతార ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ జంట కొంతమంది పిల్లలతో గడుపుతున్న సంగతి తెలిసిందే.
Amma & Appa❤️ 👨👩👦👦#wikkinayan
twin baby Boys❤️❤️
Uyir😇❤️& Ulagam😇❤️👨👩👦👦 Blessed pic.twitter.com/noyfq1I6RO— Nayanthara✨ (@NayantharaU) October 9, 2022