Krithi Shetty : నయనతార తప్పుకోవడం కృతి శెట్టికి కలిసి వచ్చేలా ఉంది..!
Krithi Shetty ఉప్పెన బేబమ్మ తెలుగులో సోసోగా కెరీర్ కొనసాగితుండగా అమ్మడు ఇప్పుడు తమిళంలో తన టాలెంట్ చూపించాలని చూస్తుంది. ఇప్పటికే జయం రవితో జినీ అనే సినిమా చేస్తున్న
- Author : Ramesh
Date : 15-02-2024 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
Krithi Shetty ఉప్పెన బేబమ్మ తెలుగులో సోసోగా కెరీర్ కొనసాగితుండగా అమ్మడు ఇప్పుడు తమిళంలో తన టాలెంట్ చూపించాలని చూస్తుంది. ఇప్పటికే జయం రవితో జినీ అనే సినిమా చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ గా ఎల్.ఐ.సి అనే సినిమాలో ఛాన్స్ అందుకుంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా లవ్ ఎమోషన్ మీదే నడుస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో నయనతారకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని టాక్. ఎలాగు భర్త విఘ్నేష్ డైరెక్షన్ కాబట్టి కంఫర్టబుల్ గానే ఉంటుందని నయనతార ముందు ఓకే చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని పట్టు పడుతుందట. కోలీవుడ్ లో నయనతార క్రేజ్ గురించి తెలిసిందే. హీరోలకు ఈక్వల్ గా ఆమె అక్కడ రెమ్యునరేషన్ తీసుకుంటారు.
అయితే హస్బండ్ సినిమా కాబట్టి కన్సెషన్ ఇస్తుందని అనుకున్నారు. కానీ నయన్ అడిగినంత ఇవ్వాల్సిందే అంటుందట. ఈ సినిమాలో డైరెక్టర్ కూడా సహ నిర్మాతగా ఉంటున్నా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా నయన్ వ్యవహరిస్తుందట. అందుకే నయనతారని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలుస్తుంది.
ప్రస్తుతం నయనతార ప్లేస్ లో ఆ రోల్ కి ఎవరినైనా తీసుకోవాలని చూస్తున్నారట. సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో నయనతారని అనుకున్నారట. మరి ఆమె ప్లేస్ లో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది చూడాలి.