Naresh : మా అమ్మ బయోపిక్ తీస్తాను.. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. నరేష్ కామెంట్స్..
తాజాగా నరేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తన తల్లి గురించి మాట్లాడారు.
- By News Desk Published Date - 09:30 PM, Sun - 19 January 25

Naresh : సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు హీరోగా చాలా హిట్స్ సాధించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. నరేష్ తల్లి విజయ నిర్మల(Vijaya Nirmala) గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి దర్శకురాలిగా మారింది. సూపర్ స్టార్ కృష్ణను రెండో వివాహం చేసుకుంది. 2019లో ఆవిడ మరణించారు. తాజాగా నరేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తన తల్లి గురించి మాట్లాడారు.
నరేష్ మాట్లాడుతూ.. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఒకేఒక్క మహిళా దర్శకురాలు మా అమ్మ విజయ నిర్మల గారు. గతంలో ఆమెకు పద్మ అవార్డు ఇవ్వాలని ఢిల్లీలో కూడా ప్రయత్నం చేశాను కానీ రాలేదు. సీఎం కేసీఆర్ గారు కూడా మా అమ్మకు పద్మశ్రీ ఇవ్వాలని సిఫార్సు చేసారు. విజయ నిర్మల గారికే కాకుండా మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది గొప్పవాళ్లకు అవార్డులు రావాలి. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచి వాళ్లకు, అర్హులకు అవార్డులు ఇస్తుంది. అందుకే ఇప్పుడు మరోసారి అమ్మకు పద్మశ్రీ అవార్డు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. విజయనిర్మల గారితో పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది గొప్పవాళ్లకు కూడా ప్రభుత్వం పద్మ అవార్డులు ఇవ్వాలి అని అన్నారు.
అలాగే తన తల్లి విజయ నిర్మల బయోపిక్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ బయోపిక్ చేయాలనే ఆలోచన ఉంది. మా అమ్మ ఉన్నప్పుడు నా బయోపిక్ గురించి నువ్వు రాయి అని చెప్పింది. అందుకే నేను అమ్మ బయోపిక్ రాస్తున్నాను. త్వరలోనే దాని గురించి చెప్తాను అని తెలిపారు. గతంలో విజయనిర్మల బయోపిక్ తీస్తారని, అందులో కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు రాగా నరేష్ అవి నిజం కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తన తల్లి బయోపిక్ కథను తానే రాయనున్నారు. మరి విజయ నిర్మల గారి బయోపిక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read : Divya Sathyaraj : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. సీఎం స్టాలిన్ పార్టీలో చేరిన దివ్య సత్యరాజ్..