HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nara Rohit Comeback Film To Be Backed By Vanara Entertainments

Nara Rohit: నారా రోహిత్ కొత్త మూవీకి డైరెక్టర్ గా టీవీ5 మూర్తి..!

యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప్రతినిథి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఈ మేరకు దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు.

  • Author : Gopichand Date : 23-07-2023 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Rohit
Resizeimagesize (1280 X 720) (1)

Nara Rohit: యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప్రతినిథి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఈ మేరకు దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు. మూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఏపీ ఎన్నికలలోపు ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

నారా రోహిత్ ‘బాణం’ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సోలో లాంటి కమర్షియల్ సినిమా చేసి హీరోగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తరవాత ఆయన చేసిన ఏ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. కానీ, నటుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ నారా రోహిత్‌‌ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది.

ఏడాదిలో రెండు నుంచి నాలుగు సినిమాల్లో నటించిన నారా రోహిత్ ఇటీవల బాగా వెనకబడిపోయారు. ఆయన చివరిగా 2018లో వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తరవాత ఆయన కొన్ని సినిమాలకు సైన్ చేసినా కోవిడ్, లాక్‌డౌన్ల కారణంగా అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఐదేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించడానికి నారా రోహిత్ సిద్ధమవుతున్నారు. మరోసారి పొలిటికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Multani Mitti: చర్మానికి వరం లాంటిది ముల్తానీ మిట్టి.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండిలా..!

తన 19వ సినిమా గురించి నారా రోహిత్ ప్రకటన చేశారు. ఈనెల 24వ తేదీన సాయంత్రం 4.03 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో 2 అనే నంబర్ రాసి ఉంది. అలాగే, చేయి పైకెత్తి రెండు వేళ్లు ముడి, మూడు వేళ్లు పైకి చూపిస్తున్నట్టు డిజైన్ చేశారు. ఈ చేతికి వార్తాపత్రికలలా కనిపిస్తున్న పేపర్లను చుట్టి ఉంచారు. ‘అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక మనిషి మరోసారి నిలబడబోతున్నాడు’ అని ఇంగ్లిష్‌లో రాశారు.

అయితే ఇది ‘ప్రతినిధి’కి ఇది సీక్వెల్ అని అంటున్నారు. ‘ప్రతినిధి 2’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకైన రోహిత్‌తో మూర్తి సినిమా చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కాగా, టీవీ5 మూర్తి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • movie updates
  • Nara Rohit
  • Nara Rohit 19
  • tollywood
  • TV5 Murthy

Related News

Vijay- Rashmika Wedding

విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

వివాహం వంటి శుభకార్యాల పట్ల అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ ఉత్సాహం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదు.

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Actress Rekha Vedavyas

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన..ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు

Latest News

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd