Nani Srikanth Odela : లీడర్ అయ్యేందుకు ఐడెంటిటీ అవసరం లేదు.. నాని దసరా కాంబో ఫిక్స్..!
Nani Srikanth Odela న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సెన్సేషనల్ హిట్ అయ్యింది. నానిని కేవలం లవర్ బోయ్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో మాత్రమే చూసే ఆడియన్స్ ని దసరా ధరణి పాత్రతో
- By Ramesh Published Date - 07:38 PM, Sat - 30 March 24

Nani Srikanth Odela న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సెన్సేషనల్ హిట్ అయ్యింది. నానిని కేవలం లవర్ బోయ్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో మాత్రమే చూసే ఆడియన్స్ ని దసరా ధరణి పాత్రతో షాక్ అయ్యేలా చేశాడు. దసరా సినిమా చూసిన వాళ్లంతా కూడా నాని ఇన్నాళ్లు ఇలా ఎందుకు ట్రై చేయలేదని అనుకున్నారు. కొత్త దర్శకుడే అయినా నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి నానికి 100 కోట్ల మార్క్ దాటేలా చేశాడు శ్రీకాంత్ ఓదెల.
దసరా కాంబినేషన్ లో మళ్లీ సినిమా అంటూ ఈమధ్య వార్తలు రాగా అవి రూమర్స్ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా నాని తన సోషల్ మీడియాలో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. సిగరెట్ తో నాని వెనకాల వందల కొద్దీ జనం లీడర్ అయ్యేందుకు ఐడెంటిటీ అవసరం లేదనే క్యాప్షన్ ఇవన్నీ చూస్తుంటే మళ్లీ దసరా కాంబో మరో సంచలనానికి సిద్ధమయ్యారని అనిపిస్తుంది.
దసరా డైరెక్టర్ హీరోనే కాదు నిర్మాత కూడా అతనే కాబట్టి ఈ దసరా కాంబో మళ్లీ మరో క్రేజీ మూవీ ఆడియన్స్ కి అందించబోతున్నారని అర్ధమవుతుంది. అనౌన్స్ మెంట్ తోనే అదరగొట్టిన నాని సినిమాతో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది.