Nandamuri Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్.. పోస్టర్ మామూలుగా లేదుగా..!
ఈ మూవీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఉండనుంది. ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమాలోని లుక్‌ని విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు.
- By Gopichand Published Date - 11:15 AM, Fri - 6 September 24
Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు.
అయితే ఈ లుక్‌లో మోక్షజ్ఞ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఉండనుంది. ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమాలోని లుక్‌ని విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, అప్డేట్స్ వెల్లడించనున్నారు. అయితే ఈ మూవీతో మోక్షజ్ఞ నందమూరి అభిమానులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. అయితే మోక్షజ్ఞ తొలి సినిమా రూ. 60 కోట్లతో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి సినిమాకే ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే సినిమా కథ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూవీ ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో భాగమా..? లేక ఇది వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం రావటంతో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Vinakaya Chavithi 2024: వినాయకచవితి పండుగను 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗
Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx
— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024
ఇకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు హీరోలు రాణిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుం బాబీ డైరెక్షన్‌లో తన 109వ చిత్రంలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ దేవర, వార్-2 మూవీ చిత్రాలతో తీరిక క్షణం లేకుండా ఉన్నారు. కల్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. మోక్షజ్ఞ కూడా ఈ నందమూరి హీరోలాగా టాప్ స్టార్‌గా ఎదుగుతాడని ఇప్పటి నుంచే అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మూవీ కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌ని నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం.
Tags
Related News
Jr NTR : ముంబైలో ఎన్టీఆర్.. బాలీవుడ్ నుంచి మొదలుపెట్టిన ‘దేవర’ ప్రమోషన్స్..
ఇప్పటివరకు దేవర సినిమాకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. ట్రైలర్ లాంచ్ తోనే మొదలుపెట్టనున్నారు.