Vinakaya Chavithi 2024: వినాయకచవితి పండుగను 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
వినాయక చవితి పండుగను 10 రోజుల పాటు జరుపుకోవడం వెనుక ఉన్న కారణం గురించి తెలిపారు.
- By Nakshatra Published Date - 11:00 AM, Fri - 6 September 24
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఢిల్లీ నుంచి గల్లి వరకు ప్రతి ఒక్క చోట వినాయక విగ్రహాలు వినాయక మండపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వినాయక చవితికి సంబంధించిన హంగామానే కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటికే భారీ గణనాథుల విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేసి డెకరేషన్ పనులను చూసుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్రదేశాలలో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ వినాయక చవితి పండుగను దాదాపుగా మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు జరుపుకుంటూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
ముంబై హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద సిటీలలో 11 రోజులపాటు ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. 10 రోజులు పూజలు చేసిన తర్వాత వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వినాయకుడికి మూడుసార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. మరి వినాయకుడికి పది రోజులపాటు ఎందుకు పూజ చేస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వినాయక చవితి సందర్భంగా గణేశుడికి 10 రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి పది రోజులు మాత్రమే ఉండి వెళ్లాడని అంటారు.
భక్తుల నిరంతరం పూజించడం వల్ల కైలాసానికి దూరంగా ఉంటాడేమో అని అనుకొని పార్వతీదేవి పది రోజులపాటు పూజలు అందుకొని రమ్మని చెప్పిందనట్లుగా చెబుతారు. అందువల్ల పది రోజులు పాటు భక్తులు వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి సందర్భంగా చాలామంది గణేష్ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేసి ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. విగ్రహంలోకి దైవాన్ని ఆవాహనం చేస్తారు. రెండు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినాయకుడిని సంతోష పెడతారు. తమ భక్తికి చిహ్నంగా మోదకం, పూలు, కొబ్బరికాయలు, వెలగపండు, ఇతర వస్తువులు సమర్పిస్తారు. సాయంత్రం వేళలో పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత చతుర్దశి అని పిలిచే పదవ రోజున పండుగ ముగింపుని సూచిస్తుంది. మట్టితో, అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన పెద్ద పెద్ద భారీ చేసిన విగ్రహాలను సమీపంలోని నదులు, సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా అంటూ గణేషుడికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు.
note : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.
Related News
Lord Ganesh: వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా?
వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ వెనుక పెద్ద కథే ఉందట.