HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagababu Viral Cryptic Tweet About Allu Arjun And Pushpa 2

Nagababu Tweet About Pushpa 2: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తికర ట్వీట్‌.. పుష్ప‌-2 గురించేనా..?

ఈ మూవీ రిలీజ్‌కు ముందు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్వీట్ చేయ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఏపీ ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి వెళ్ల‌డంతో అప్ప‌టినుంచి మెగా- అల్లు అభిమానుల మ‌ధ్య వైరం మొద‌లైంది.

  • Author : Gopichand Date : 04-12-2024 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagababu Tweet About Pushpa 2
Nagababu Tweet About Pushpa 2

Nagababu Tweet About Pushpa 2: ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప‌-2 హ‌వా న‌డుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావటంతో ఈ సినిమాపై సినీ ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే డిసెంబ‌ర్ 5వ తేదీన అంటే రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈరోజు ప్రీమియ‌ర్ షోలు కూడా ప‌డ‌నున్నాయి. అయితే టిక్కెట్ల కాస్ట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్రీమియ‌ర్ షోల‌కు ప్రేక్ష‌కులు ఎక్కువ మ‌క్కువ చూప‌టంలేదు. అల్లు అర్జున్ పుష్ప‌-1 త‌ర్వాత వ‌స్తోన్న మూవీ కావ‌టంతో బ‌న్నీ ఫ్యాన్స్ థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి చేస్తున్నారు.

ఇక‌పోతే ఈ మూవీ రిలీజ్‌కు ముందు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్వీట్ చేయ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఏపీ ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి వెళ్ల‌డంతో అప్ప‌టినుంచి మెగా- అల్లు అభిమానుల మ‌ధ్య వైరం మొద‌లైంది. ఇదే విష‌యం చాలా సార్లు బ‌య‌ట‌ప‌డింది. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగ‌బాబు కూడా ప‌లు సార్లు ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ల‌లో త‌న అస‌హ‌నాన్ని బ‌య‌ట‌పెట్టారు. తాజాగా అల్లు అర్జున్ పేరు ఎత్త‌కుండా, పుష్ప‌-2 సినిమా గురించి అని చెప్ప‌కుండా ఆయ‌న చేసిన ట్వీట్ (Nagababu Tweet About Pushpa 2) ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read: New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వ‌చ్చిన ఫీచ‌ర్లు ఇవే!

24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల‌ మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*

ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…

అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని…

— Naga Babu Konidela (@NagaBabuOffl) December 4, 2024

నాగ‌బాబు ట్వీట్ ఇదే

నాగ‌బాబు ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. “24 క్రాఫ్ట్‌ల‌ కష్టంతో వందల మంది టెక్నీషియ‌న్ల‌ శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను.. 🙏” అని ఆయ‌న తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ పుష్ప‌-2 గురించే అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మెగా అభిమానులు కూడా సినిమాని ఆద‌రించాల‌ని నాగ‌బాబు కోరిన‌ట్లు ట్వీట్ చూస్తే అర్థ‌మ‌వుతోంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాన్స్‌తో ‘పుష్ప-2’ వీక్షించనున్న అల్లు అర్జున్

‘పుష్ప-2’ సినిమాను తన అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకుంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఎటువంటి అధికారిక‌ ప్రకటన అయితే రాలేదు. కాగా.. దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

విదేశాల్లో నేడే థియేటర్లలోకి ‘పుష్ప-2’

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ‘పుష్ప-2’ సినిమా నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 9.30 నుంచే ప్రీమియర్లు పడబోతున్నాయి. సోషల్ మీడియాతో పాటు బయట జనం మధ్యలో కూడా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bunny
  • Icon Star Allu Arjun
  • movie updates
  • Nagababu Tweet About Pushpa 2
  • Nagababu Viral Tweet
  • Pushpa 2
  • Pushpa Mania
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd