Naga Saroja : అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం ..
గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగ సరోజ..పని నిమిత్తం ముంబై కి వెళ్లగా..అక్కడే కన్నుమూసినట్లు సమాచారం
- By Sudheer Published Date - 07:05 PM, Wed - 18 October 23

టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna Sister) సోదరి నాగ సరోజ (Naga Saroja ) కన్నుమూశారు. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara rao)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందులో నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ కుమార్తెలు కాగా…వెంకట్, నాగార్జున కుమారులు. అయితే నాగ సత్యవతి ఇప్పటీకే కన్నుమూయగా..ఈరోజు నాగ సరోజ కన్నుమూశారు.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో (Naga Saroja Health problems) బాధపడుతున్న నాగ సరోజ..పని నిమిత్తం ముంబై కి వెళ్లగా..అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి…హుటా హుటిన బయలుదేరి, అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ విషయం తెలిసి చిత్రసీమ ప్రముఖులు నాగార్జున కు ధైర్యం చెపుతూ..నాగ సరోజ ఆత్మ కు శాంతి కోరుతున్నారు.
ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో (Bigg Boss 7)కి హోస్టుగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్టుగా వ్యవహారిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సోదరి మృతితో దుఃఖంలో ఉన్న నాగార్జున.. ఈ వారం హోస్టుగా ఉండకపోవచ్చు అని అంటున్నారు.
Read Also : Japan Teaser : కార్తీ జపాన్ టీజర్ చూశారా? దీపావళికి సరికొత్త బ్లాస్ట్..