Naga Chaitanya: నాగ చైతన్య “థ్యాంక్యూ” రిలీజ్ డేట్ ఫిక్స్!
నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా "థ్యాంక్యూ".
- By Balu J Published Date - 11:08 AM, Sat - 25 June 22
నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా “థ్యాంక్యూ”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “మనం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు “మారో..”, “ఏంటో ఏంటేంటో…” చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
టీజర్ తో పాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో “థ్యాంక్యూ” సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా “థ్యాంక్యూ” సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు. *అన్ని కమర్షియల్ హంగులతో “థ్యాంక్యూ” సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది*. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. నాగ చైతన్య కెరీర్ లో “థ్యాంక్యూ” ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.
Related News
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. చిన్న విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి