HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mukesh Ambani Fully Acquire Alia Bhatts Children Wear Brand Ed A Mamma For Rs 350 Crores

Mukesh Ambani-Alia Bhatt : హీరోయిన్ ఆలియా భట్ కంపెనీని కొనేయనున్న ముకేశ్ అంబానీ

Mukesh Ambani-Alia Bhatt : ఆలియా భట్ కు "ఎడ్-ఎ-మమ్మ" పేరుతో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ బ్రాండ్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.

  • By Pasha Published Date - 05:05 PM, Mon - 17 July 23
  • daily-hunt
Mukesh Ambani Alia Bhatt
Mukesh Ambani Alia Bhatt

Mukesh Ambani-Alia Bhatt : ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ కు “ఎడ్-ఎ-మమ్మ” పేరుతో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఉంది. 

ఇందులో చిన్న పిల్లల దుస్తులను విక్రయిస్తుంటారు. 

దీన్ని కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ ప్రతినిధులు ఆలియా భట్ తో చర్చలు జరుపుతున్నారు.

ఒకవేళ ఫైనల్ అయితే.. ఈ డీల్ విలువ దాదాపు రూ.350 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

పది రోజుల్లో ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు . 

Also read : Congress Shuffule : రేవంత్ కు పొంచి ఉన్న ప‌ద‌వీగండం?

రిలయన్స్ బ్రాండ్స్ యొక్క మాతృ సంస్థ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL). ఇది దేశంలోనే అతిపెద్ద రిటైలర్ లలో ఒకటి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ బిజినెస్ గ్రూప్ ప్రస్తుతం కిడ్స్‌వేర్ డొమైన్‌ కోసం బ్రిటిష్ రిటైలర్ మదర్‌కేర్ పై ఆధారపడుతోంది. ఒకవేళ  ఆలియా భట్ కు చెందిన “ఎడ్-ఎ-మమ్మ” (Ed-a-Mamma)  చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ను కొనుగోలు చేస్తే  పిల్లల దుస్తుల మార్కెట్‌లో రిలయన్స్‌కు మరింత పట్టు పెరుగుతుందని అంటున్నారు.  మనదేశంలో పిల్లల దుస్తుల మార్కెట్‌ సైజు దాదాపు రూ. 13,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. Ed-a-Mamma బ్రాండ్ ప్రోడక్ట్స్ సేల్స్ అనేవి ప్రధానంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, దాని స్వంత వెబ్‌సైట్ ద్వారా, Myntra, Ajio, FirstCry, Amazon, Tata CliQ వంటి యాప్‌లతో జరుగుతోంది. Ed-a-Mamma బ్రాండ్ ప్రోడక్ట్స్ ను లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్ వంటి రిటైల్ చైన్‌ల ద్వారా కూడా విక్రయిస్తున్నారు.

Also read : Sridevi Vijaykumar : చిలక పచ్చ రంగు చీరలో తన్మయింప చేస్తున్న శ్రీదేవి విజయకుమార్

ఎడ్-ఎ-మమ్మా వివరాలు ఇవీ..  

పిల్లలు, పసిబిడ్డల కోసం 2020లో Ed-a-Mamma బ్రాండ్ ను ఆలియా భట్ ప్రారంభించారు. తర్వాతి దశల్లో ఈ బ్రాండ్ ను టీనేజ్, మెటర్నిటీ వేర్ విభాగాలకు కూడా  విస్తరించారు. ఇది పర్యావరణ స్పృహతో కూడిన దుస్తుల బ్రాండ్‌. ఆలియా భట్..  “ఎటర్న్ ఆలియా క్రియేటివ్ అండ్ మర్చండైజింగ్‌”లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ను ఈ సంస్థ(Mukesh Ambani-Alia Bhatt) ద్వారా నిర్వహిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • business
  • children wear brand
  • Ed-a-Mamma
  • Isha Ambani
  • mukesh ambani
  • Mukesh Ambani-Alia Bhatt
  • Piramal
  • Reliance Brands
  • Rs 350 cr deal

Related News

Rupee

Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.22 శాతం పెరిగి 69.57 డాలర్లు ప్రతి బ్యారెల్ ధర వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం అమ్మకందారులుగా ఉన్నారు.

  • Tax Audit Reports

    Tax Audit Reports: ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ గడువు పొడిగింపు!

  • UPI Boom

    UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

  • Gautam Adani

    Gautam Adani: గౌత‌మ్ అదానీకి బిగ్ రిలీఫ్‌.. షేర్ హోల్డర్లకు లేఖ!

  • Gold Rate Hike

    Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd