Mrunal Thakur : ఈ హీరోయిన్ డెంటల్ డాక్టరా.. ఏజ్ కూడా థర్టీ ప్లస్సా..?
Mrunal Thakur ఈమధ్య హీరోయిన్స్ గా చేస్తూనే మరోపక్క ప్రొఫెషనల్ గా వేరే డిగ్రీ సంపాధిస్తున్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని ఎవరో చెప్పినట్టుగా డాక్టర్
- By Ramesh Published Date - 11:10 PM, Sat - 4 November 23
Mrunal Thakur ఈమధ్య హీరోయిన్స్ గా చేస్తూనే మరోపక్క ప్రొఫెషనల్ గా వేరే డిగ్రీ సంపాధిస్తున్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని ఎవరో చెప్పినట్టుగా డాక్టర్ అయ్యి కూడా యాక్టర్ గా రాణిస్తున్నారు నేటితరం భామలు. ఇప్పటికే సినీ పరిశ్రమలో డాక్టర్స్ లిస్ట్ చాలా ఎక్కువే ఉంది. సాయి పల్లవి నుంచి లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల (Srileela) వరకు ఓ పక్క M.B.B.S చేస్తూ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో భామ కూడా చేరిపోయింది. సీతారామం తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మృణాల్ ఠాకూర్ సినీ కెరీర్ కన్నా ముందు డెంటల్ డాక్టర్ గా చేసిందట.
Also Read : Guntur Kaaram: గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
ముందు సీరియల్స్ లో రాణించి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ డెంటల్ డాక్టర్ అన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు ఆమె ఏజ్ కూడా 31 ఇయర్స్ అని తెలుస్తుంది. సీతారామంతో తెలుగు లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మృణాల్ ప్రస్తుతం నాని (Nani) తో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేస్తుంది.
ఈ రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మరింత పెరుతుందని చెప్పొచ్చు. మృణాల్ ఠాకూర్ తెలుగులోనే కాదు అటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. సౌత్ ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు మృణాల్ చాలా సంతోషంగా ఉంది. తెలుగులో రాబోయే సినిమాలతో మృణాల్ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు.
We’re now on WhatsApp : Click to Join