Guntur Kaaram: గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
- By Balu J Published Date - 06:08 PM, Sat - 4 November 23

Guntur Kaaram: గుంటూరు కారం మొదటి సింగిల్ నవంబర్ 7న వస్తుందని ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నాగ వంశీ తీపి సర్ ప్రైజ్ ఇచ్చారు. గుంటూరు కారం పాట చిన్న క్లిప్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో, దాని విడుదలను ఆలస్యం చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు. మొదట్లో మెలోడీ సాంగ్ లాంచ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు లీక్ అయిన సాంగ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
దమ్ మసాలా పేరుతో పాట ప్రోమో రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. అదే విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ మహేష్ బాబు పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో మహేష్ సిగార్ తాగుతూ కనిపించాడు. థమన్ అంచనాలను అందుకుంటాడా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మాస్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హ్యాపెనింగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గుంటూరు కారం 2024 జనవరి 12న పెద్ద తెరపైకి రానుంది.