Mohan Babu Health Bulletin : మోహన్ బాబు హెల్త్ బులెటిన్
Mohan Babu Health Bulletin : బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని , హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ కనిపించాయని తెలిపారు
- By Sudheer Published Date - 01:46 PM, Wed - 11 December 24

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి (Continental Hospital)లో (Mohan Babu Admitted in Hospital) చేర్పించారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj)తో ఏర్పడిన గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గొడవల్లో మోహన్ బాబు బీపీ పెరగడంతో కిందపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను హాస్పటల్ కు తరలించారు.
ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి కిందటే కాంటనెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మోహన్ బాబు ఆరోగ్యానికి సంబదించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. మంగళవారం రాత్రి 8:30 గంటలకు మోహన్ బాబు స్పృహ తప్పిన కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్, యాంక్జయిటీతో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు వెల్లడించారు. వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసాం.
ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని , హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ కనిపించాయని తెలిపారు. దీనితో వెంటనే మోహన్ బాబును హైబీపీ, హార్ట్ స్పెషలిస్టులతో వైద్య చికిత్సను అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని అన్నారు. ఈ టీమ్‌లో కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, ఇతర ఫిజీషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని, తదుపరి బులెటిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Read Also : Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!