Megastar Chiranjeevi : వాటి దారుల్లోనే మెగా విశ్వంభర కూడానా..?
ఐకానిక్ సినిమాల లిస్ట్ లో ఇది కూడా ఉంటుంది. టాప్ 10 కాదు టాప్ 3 ల్లో విశ్వంభర చేరుతుందని అంటున్నాడు.
- By Ramesh Published Date - 07:08 PM, Sun - 4 August 24

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో చిరుకి జతగా త్రిష నటిస్తుండగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషికి రంగనాథ్ మరో ఇద్దరు కూడా సినిమాలో భాగం అవుతున్నారు. ఈమధ్య చిరు సినిమాలన్నీ రొటీన్ గా ఉంటున్నాయన్న టాక్ రాగా అలా అన్న వాళ్ల నోరు మూయించేలా మెగా ప్లాన్ తో ఈ సినిమా వస్తుంది.
ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ట బీభత్సమైన కాన్ ఫిడెన్స్ తో ఉన్నాడు. చిరు (Chiru) ఐకానిక్ సినిమాల లిస్ట్ లో ఇది కూడా ఉంటుంది. టాప్ 10 కాదు టాప్ 3 ల్లో విశ్వంభర చేరుతుందని అంటున్నాడు. మెగా విశ్వంభర సినిమా విషయంలో ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారు. ఐతే ఈమధ్య పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా తెస్తున్నారు. మెగాస్టార్ విశ్వంభర సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
Also Read : Govt Schools : ప్రభుత్వ స్కూల్స్ లలో కారం భోజనం పెడుతున్న రేవంత్ సర్కార్ – హరీష్ రావు
అంటే అన్ని సినిమాల్లా ముందే రెండు భాగాలు అని ఫిక్స్ అవ్వకుండా విశ్వంభర చివర్లో కథ కొనసాగింపుగా లీడ్ ఇస్తారని తెలుస్తుంది. సినిమా అనుకున్న విధంగా క్లిక్ అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ కూడా తీస్తారని తెలుస్తుంది. విశ్వంభర రెండు భాగాలు అని తెలిసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విశ్వంభర (Viswambhara) సినిమా పెద్ద ప్లానింగ్ తోనే వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ వశిష్ట మాత్రం సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నాడు.