Chiranjeevi Pawan Kalyan : చిరంజీవి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఫైట్..?
Chiranjeevi Pawan Kalyan మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర
- By Ramesh Published Date - 06:28 PM, Thu - 15 February 24

Chiranjeevi Pawan Kalyan మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 150 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
మరోపక్క పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాకు టైం ఇవ్వలేకపోయాడు. అయితే ఏపీ ఎలక్షన్స్ తర్వాత పవన్ వీరమల్లు పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.
మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమా ఈ ఇయర్ సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. పవన్ ఫ్రీ అవ్వగానే ముందు ఓజీని పూర్తి చేసి ఆ తర్వాత వీరమల్లుని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే సంక్రాంతికి చిరు వస్తున్నాడు కాబట్టి పవన్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. మేకర్స్ మాత్రం 2025 సంక్రాంతికి వీరమల్లు పక్కా అంటున్నారు.