Chiru with Puri: పూరితో చిరు సినిమా.. ‘ఆల్వేస్ వెల్‌కం’ అంటూ గ్రీన్ సిగ్నల్!
చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father).
- Author : Balu J
Date : 13-10-2022 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చిరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. అయితే చిరు కమ్ బ్యాక్ మూవీ చేసే చాన్స్ మొదట పూరీకే వచ్చింది. ఆ టైమ్‌లో చిరుకి పూరీ చెప్పిన ఆటో జానీ కథ నచ్చినా, ఆ టైమ్‌లో ఆ సబ్జెట్ కరెక్ట్ కాదని, తమిళ్ మూవీ కత్తి రీమేక్ చేసి ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి హిట్ కొట్టారు.
ఇక ఆ తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. అయితే గాడ్ ఫాదర్ మూవీ ద్వారా మళ్ళీ కలిసిన చిరు అండ్ పూరీలు, బుధవారం రాత్రి జరిగిన చిట్ చాట్ ద్వారా చిన్న హింట్ ఇచ్చారు. ముందుగా పూరీ జగన్నాథ్‌ని కొత్త కథలు, కొత్త స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి అడిగారు. ఆ తర్వాత ఆటో జానీ స్క్రిప్ట్ ఉందా చింపేశారా అని అడగ్గా, ఆ సబ్జెట్‌ని పక్కన పెట్టేశానని, మీ కోసం మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాని చెప్పాడు పూరీ. మీరు ఎప్పుడు వచ్చినా కథ వినేందుకు తాను సిద్ధంగా ఉంటానని, ఆల్వేస్ వెల్‌కమ్ అని చిరంజీవి రిప్లై ఇచ్చారు.
#Chiru remembers #AutoJohnny (Shelved) and indicates at a Possible Collaboration with Director #PuriJagannadh in near future!#MegaStarChiranjveevi #Chiranjeevi #GodFather pic.twitter.com/qNwb3CQq6O
— CHITRAMBHALARE (@chitrambhalareI) October 12, 2022