Mufasa Trailer : సూపర్ స్టార్ మహేష్ వాయిస్ తో ముఫాసా ట్రైలర్..!
సినిమా కోసం ఇంట్రో ఇవ్వడం కాదు ముఫాసా రోల్ కి మహేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా కొడుకు సింబా
- By Ramesh Published Date - 04:21 PM, Mon - 26 August 24

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) తన ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ అందించారు. హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ సీక్వెల్ గా వస్తున్న ముఫాసా లయన్ కింగ్ కు ఆయన వాయిస్ ఓవర్ అందించారు. అంటే ఏదో సినిమా కోసం ఇంట్రో ఇవ్వడం కాదు ముఫాసా రోల్ కి మహేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ది లయన్ కింగ్ సినిమాలో ముఫాసా కొడుకు సింబా(Simba) కి న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ముఫాసా కోసం మహేష్ డబ్బింగ్ చెబుతున్నాడు.
ముఫాసా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. మహేష్ బాబు డబ్బింగ్ వల్ల ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ముఫాసా (Mufasa) గురించి మాట్లాడుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఒక హాలీవుడ్ సినిమాకు ఇలా డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. కచ్చితంగా మహేష్ డబ్బింగ్ వల్ల ముఫాసా సినిమా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.
లయ కింగ్ సీక్వెల్ గా వస్తున్న ముఫాసా లో తన ఫ్రెండ్ డాఖా అతనితో స్నేహం ఇలాంటి కథాంశంతో వస్తుంది. ముఫాసా చిన్ననాటి కథతో ఇది రాబోతుంది. లయన్ కింగ్ సినిమాకు కనెక్ట్ అయిన వారంతా కూడా ఈ ముఫాసాకి కూడా కనెక్ట్ అవుతారు.
లయన్ కింగ్ సినిమా మన దగ్గర కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ముఫాసాకి సూపర్ స్టార్ వాయిస్ తోడవడం వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ ముఫాసా కచ్చితంగా తెలుగులో మంచి ఫలితం అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.