Chiranjeevi Anudeep Kv : జాతిరత్నాలు డైరెక్టర్ తో మెగాస్టార్.. ఏం జరుగుతుంది..?
Chiranjeevi Anudeep Kv జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన అనుదీప్ కెవి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్
- By Ramesh Published Date - 02:38 PM, Thu - 14 March 24

Chiranjeevi Anudeep Kv జాతిరత్నాలు సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన అనుదీప్ కెవి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేసిన అనుదీప్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో సినిమా ప్లానింగ్ లో ఉన్న అనుదీప్ ఆ సినిమా బడ్జెట్ చర్చల్లో ముందుకి వెనక్కి జరుగుతున్నాయట.
ఈలోగా మెగాస్టార్ చిరంజీవి అనుదీప్ తో సినిమా చేయాలనే ఆలోచన వ్యక్తపరిచారట. రీసెంట్ గా అనుదీప్ చిరుని కలిసి ఒక కథ కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. జాతిరత్నాలు సినిమాతోనే తన డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న అనుదీప్ కెవి తప్పకుండా చిరుతో సినిమా చేస్తే సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.
చిరు ఈమధ్య కథల విషయంలో చాలా ఫోకస్ గా ఉంటున్నారు. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో మూవీ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా అనుదీప్ తో కూడా కథా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. నిజంగానే అనుదీప్ కి మెగా ఛాన్స్ వస్తే మాత్రం తన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
Also Read : Premalu OTT Release date : ప్రేమలు OTT రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?