HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar As Drill Master

MEGA 157 : డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్.. మెగా కామెడీ టైమింగ్ తెలుసుగా !!

MEGA 157 : ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మెగాస్టార్ పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ అని, ఆయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ గా ఉండనుందని సమాచారం

  • Author : Sudheer Date : 14-07-2025 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru157role
Chiru157role

మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి (Anilravipudi) దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. MEGA 157 గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. స్టార్ హీరోయిన్ నయనతార ఇందులో కథానాయికగా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా, గణేష్, బలగం మురళీధర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అభిమానులు ఈ సినిమాపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మెగాస్టార్ పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ అని, ఆయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ గా ఉండనుందని సమాచారం. చిరంజీవి కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, చిరు డ్రిల్ మాస్టర్ పాత్రలో వినోదాన్ని పంచుతుండడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది.

Hyderabad : హాస్పటల్ కు వచ్చిన రోగిపై వార్డుబాయ్ అత్యాచారం య‌త్నం

సినిమా బజ్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ ఈసారి చిరంజీవి బర్త్‌డే అయిన ఆగస్టు 22న ఓ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారని సమాచారం. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే డిఫరెంట్ టైటిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం

ఇటీవల ముస్సోరిలో కీలక సీన్లు చిత్రీకరించగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. అన్ని సన్నివేశాలూ పండగ వాతావరణానికి తగినట్లుగా డిజైన్ చేయడంతో ఈ సినిమాను సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ కలగలుపుతో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అవుతుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. మెగాస్టార్ ఫాలోయింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ కలిస్తే MEGA 157 మరో ఇండస్ట్రీ హిట్ అవడం ఖాయమనే మాటలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil ravipudi
  • chiranjeevi
  • chiranjeevi 157 anil ravipudi
  • Chiranjeevi Role in 157 movie
  • Mega 157

Related News

Grand Launch of Venky-Kalyan Ram Multi-starrer Anil Ravipudi: Venky and Kalyan Ram in Anil Ravipudi's Multi-starrer

Venkatesh Kalyan Ram: అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తి రేపుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి ఈరోజు అధికారికంగా అంకురార్పణ జరిగింది. విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ వంటి సినీ ప్రమ

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd