Hyderabad : హాస్పటల్ కు వచ్చిన రోగిపై వార్డుబాయ్ అత్యాచారం యత్నం
Hyderabad : ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పేషెంట్ పై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు
- Author : Sudheer
Date : 14-07-2025 - 1:14 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ విద్యానగర్‌లోని ప్రసిద్ధ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి (Andhra Mahila Sabha Hospital) లో ఓ వార్డ్ బాయ్ (Ward oy) చేసిన అసభ్య ప్రవర్తన తీవ్ర కలకలం రేపింది. ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పేషెంట్ పై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో మహిళా రోగిపై అత్యాచారయత్నానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ భయంతో గట్టిగా అరవడంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
Suresh Raina: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సురేష్ రైనా?!
ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని వార్డ్ బాయ్‌ను చితకబాదారు. వెంటనే నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తనపై అత్యాచారయత్నం జరిగిందని పేర్కొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రి సిబ్బందిని విచారించడంతో పాటు, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
నల్లకుంట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, వార్డ్ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిపై అత్యాచారయత్నం, అసభ్య ప్రవర్తన సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో మహిళల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు వేస్తోంది. ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా స్పందించడంతో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.