Wayanad Landslides : కేరళ వరద బాధితులకు మెగా హీరోల సాయం
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు వచ్చి ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లిన..ఆ బాధితులకు సాయం చేసేందుకు మెగా హీరోలు ముందుకు వస్తూ.. తమ వంతు సాయం చేస్తుంటారు
- Author : Sudheer
Date : 04-08-2024 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
అభిమానులను అలరించడమే కాదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మేమున్నాం అంటూ మెగా హీరోలు ఎప్పుడు ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు వచ్చి ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లిన..ఆ బాధితులకు సాయం చేసేందుకు మెగా హీరోలు ముందుకు వస్తూ.. తమ వంతు సాయం చేస్తుంటారు. తాజాగా కేరళ వరదల (Wayanad Landslides) కారణంగా వందలాది మంది మరణించడమే కాదు. వేలకోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లు తమవంతు సాయం ప్రకటించారు. చిరంజీవి , రామ్ చరణ్ కేరళ CMRFకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వీరు మాత్రమే కాదు మోహన్ లాల్ 3 కోట్లు, కమల్ హాసన్ 25 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు, నయనతార – విగ్నేష్ జంట 20 లక్షలు, తెలుగు నిర్మాత నాగవంశీ 5 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాజిల్ , నజ్రియా కలిపి 25 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇంకా పలువురు సినీ నటీనటులు, ప్రముఖులు వయనాడ్ కి విరాళాలు ప్రకటించేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also : 400 IOCL Jobs : ఏపీ, తెలంగాణలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో జాబ్స్