Meenakshi Chowdhary : ఇలాంటి పాత్రలు అవసరమా మీనాక్షి..!
సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)
- Author : Ramesh
Date : 12-01-2024 - 5:50 IST
Published By : Hashtagu Telugu Desk
సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary). ఆ సినిమా నుంచి సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. హిట్ 2 లో కూడా ఆమె హీరోయిన్ గా నటించి మెప్పించింది. సినిమాలు సోషల్ మీడియా ఫాలోయింగ్ తో మీనాక్షి టాలీవుడ్ లో మంచి అటెన్షన్ సాధించింది. ఇదే ఊపుతో సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చే సినిమాల్లో సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ బ్యాక్ ఫైర్ అవుతున్నా సరే మీనాక్షి మహేష్ ఛాన్స్ అనగానే ఓకే అనేసింది.
We’re now on WhatsApp : Click to Join
ఇదివరకు సినిమాల్లో ఏమో కానీ ఈసారి మీనాక్షిని గురూజీ బాగానే వాడుకుని ఉంటాడని ఊహించిన ఆడియన్స్ కి గుంటూరు కారం చూసిన తర్వాత పెద్ద షాకే తగిలింది. మహేష్ మరదలి పాత్రలో మీనాక్షి ఇచ్చిన పాత్రకు న్యాయం చేసినా సరే ఓ పక్క యువ హీరోలతో సోలో హీరోయిన్ గా చేస్తున్న అమ్మడిని తీసుకొచ్చి జస్ట్ హీరోలకు మందు కలిపి ఇవ్వడం లాంటి సీన్స్ కి పరిమితం చేయడం మీనాక్షి ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది.
మహేష్ (Mahesh Babu) సినిమా.. త్రివిక్రం డైరెక్షన్ అనగానే మీనాక్షి కూడా అంతకుమించిన ఛాన్స్ లేదని ఓకే అనేసి ఉండొచ్చు కానీ ఆమె చేస్తున్న పాత్ర సినిమాలో ఎంత వెయిట్ ఉంటుంది అన్నది మాత్రం ఆలోచించుకోలేకపోయింది. గుంటూరు కారం సినిమా చూసిన ఆడియన్స్ మీనాక్షి ఏంటి ఇంత చిన్న పాత్రలో ఏంటని అనుకుంటున్నారు. హీరోయిన్ గా రాణించాలంటే ఎలాంటి చిన్న పాత్ర వచ్చినా చేయాలి అయితే అది చిన్న పాత్ర అయినా సరే సినిమాలో కీలకం అయ్యుండాలి. కానీ అలా కాకుండా కేవలం ఇలా ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర కోసం అయితే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నో చెబితేనే బెటర్.
Also Read : Guntur Karam vs Hanuman : హనుమాన్ కి ప్లస్ అయ్యేలా గుంటూరు కారం డివైడ్ టాక్..!
త్రివిక్రం (Trivikram) డైరెక్షన్ లో సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కంపల్సరీ ఆ హీరోయిన్ కి ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం కూడా గ్యారెంటీ అని గురూజీ మరోసారి ప్రూవ్ చేశాడు. అరవింద సమేతలో ఈషా రెబ్బ, అల వైకుంఠపురములో మూవీలో నివేదా పేతురాజ్, గుంటూరు కారం లో మీనాక్షి ఇలా సెకండ్ హీరోయిన్ అంటూ మోసం చేసి హీరోయిన్స్ తో సైడ్ రోల్స్ చేయిస్తున్నాడు త్రివిక్రం. ఇలా అయితే ఆయన సినిమాల్లో హీరోయిన్ గా అంటే ఫ్యూచర్ లో ఎవరు కూడా ముందుకొచ్చే అవకాశం ఉండదు.