Meenakshi Chaudhary : కమెడియన్ సరసన ఛాన్స్.. హీరోయిన్ ప్లాన్ ఏంటో..?
Meenakshi Chaudhary సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తెలుగులో వరుస సినిమాలతో
- By Ramesh Published Date - 12:25 PM, Sat - 22 June 24

Meenakshi Chaudhary సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవుతుంది. తెలుగుతో పాటుగా కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది మీనాక్షి. ఇప్పటికే దళపతి విజయ్ తో గోట్ సినిమాలో నటించిన అమ్మడు ఆ తర్వాత మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. ఐతే ఈసారి స్టార్ కమెడియన్ సంతానం చేస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది.
సంతానం హీరోగా చేస్తున్న దిల్లుకు దుడ్డు 3 సినిమాలో ఫిమేల్ లీడ్ గా మీనాక్షిని తీసుకున్నారట. ఈ సినిమాను కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తుండగా ప్రేమానంద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓ పక్క స్టార్ హీరోతో నటించిన మీనాక్షి వెంటనే కమెడియన్ సరసన నటించడం గురించి కోలీవుడ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.
హీరో ఎవరైనా చేయాల్సిన పాత్ర నచ్చితే చేస్తారు హీరోయిన్స్. అలానే మీనాక్షి చౌదరి కూడా విజయ్ సినిమా అయినా వేరే వాళ్ల సినిమా అయినా తన పాత్ర నచ్చితే సరిపోతుందని అనుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో షేక్ చేస్తుంది మీనాక్షి. ఈ ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుంది.
Also Read : Venkatesh : వెంకటేష్ హీరోయిన్ గా మీనాక్షి కాదా.. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్నారా..?