Meenakshi Chaudhary : దేవకన్యగా మీనాక్షి.. మెగా విశ్వంభర లో లక్కీ ఛాన్స్..!
Meenakshi Chaudhary అందాల భామ మీనాక్షి చౌదరి సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా నుంచి అమడు తన మార్క్ నటనతో మెప్పిస్తూ
- By Ramesh Published Date - 08:19 AM, Tue - 6 February 24

Meenakshi Chaudhary అందాల భామ మీనాక్షి చౌదరి సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా నుంచి అమడు తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తుంది. ఖిలాడి, హిట్ 2 ఇలా వరుస సినిమాలు చేస్తున్న మీనాక్షి మహేష్ గుంటూరు కారం సినిమాలో మరదలి పాత్రలో నటించింది. సినిమా చూసిన వారంతా మీనాక్షి అసలు ఎందుకు అలాంటి పాత్ర చేసిందని అన్నారు కానీ మహేష్ త్రివిక్రం ఈ కాంబో సినిమా అనేసరికి అమ్మడు ఆలోచించకుండా చేసింది.
గుంటూరు కారం ఆమె కెరీర్ కు ఎంత హెల్ప్ అయ్యిందో తెలియదు కానీ లేటెస్ట్ గా అమ్మడు మరో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న విశ్వంభర సినిమాలో మీనాక్షి భాగం కానుందట. ఈ సినిమాలో త్రిష ఆల్రెడీ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ ఆ మీనాక్షిని కూడా మరో హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది.
విశ్వంభర సినిమాలో మీనాక్షి నటించడం ఆమెకు కెరీర్ కు నిజంగానే హెల్ప్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. సినిమాలో దేవకన్యగా మీనాక్షి కనిపించబోతుందని చెప్పొచ్చు. అసలే అందాల భామ అలాంటి మీనాక్షిని దేవకన్యగా చూపిస్తున్నారంటే విశ్వంభర సినిమా ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.
యువి క్రియేషన్స్ 150 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నారు. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ సినిమా కూడా మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.