Raviteja : రవితేజ ఆశలన్నీ అతని మీదే..!
Raviteja శ్రీ విష్ణుతో సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను ఒక అదిరిపోయే కథతో రవితేజకు వినిపించాడట. అందుకే అతన్నే డైరెక్టర్ గా పెట్టి సినిమా చేస్తున్నారు.
- By Ramesh Published Date - 07:50 AM, Wed - 25 September 24

మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) కెరీర్ ఇప్పుడు అంత అద్భుతంగా అయితే లేదని చెప్పొచ్చు. ధమాకా హిట్ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు వచ్చాయి. ఈ సినిమాల వల్ల మాస్ రాజా ఇమేజ్ కూడా దెబ్బ తింటుంది. చివరగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే రవితేజ తన రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అర్జెంట్ గా రవితేజకు ఒక సూపర్ హిట్ సినిమా కావాలి.
ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల (Srileela) హీరోయిన్ గా నటిస్తుంది. ధమాకా (Dhamaka) తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇదే. రవితేజ మార్క్ ఎంటర్టైనర్ తో పాటుగా యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.
అదిరిపోయే కథతో రవితేజ..
శ్రీ విష్ణుతో సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను ఒక అదిరిపోయే కథతో రవితేజకు వినిపించాడట. అందుకే అతన్నే డైరెక్టర్ గా పెట్టి సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఐతే రవితేజకు భుజానికి గాయం కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
అసలైతే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. రవితేజకు రెస్ట్ అవసరమని తెలిసి సినిమా వాయిదా వేశారు. తప్పకుండా రవితేజ ని తిరిగి ఫాం లోకి తెచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మాస్ రాజా ఫ్యాన్స్ అతని కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. భానుతో చేస్తున్న సినిమా మీద రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది.
Also Read : Devara Pramotions : దేవర ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు..!