Devara Pramotions : దేవర ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు..!
Devara Pramotions దేవర సినిమాలో షార్క్ ఫైట్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ కానీ ఫ్యాన్స్ మాత్రం రియల్ షార్క్ తో దేవర ప్రమోషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో
- By Ramesh Published Date - 07:27 AM, Wed - 25 September 24

Devara Pramotions ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కు ఉన్న అభిమాన గళం ఏంటో స్పష్టంగా తెలియచేసేలా అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ అంతా సముద్రం బ్యాక్ డ్రాప్ లో కాబట్టి ఆల్రెడీ అంతకుముందే సముద్రంలో దేవర కటౌట్ పెట్టారు ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్.
ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా సముద్రంలొ ఏకంగా షార్క్ కి ఎన్టీఆర్ (NTR) దేవర ఫోటోని ఉంచారు. దేవర సినిమాలో షార్క్ ఫైట్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ కానీ ఫ్యాన్స్ మాత్రం రియల్ షార్క్ తో దేవర ప్రమోషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తారక్ స్టామినా ఏంటో తెలిసేలా..
దేవర (Devara) విషయంలో ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదు. తారక్ స్టామినా ఏంటో తెలిసేలా బాక్సాఫీస్ దగ్గర కూడా బీభత్సం సృష్టించేలా ఉన్నారు. దేవర లో ఎన్ టీ ఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుని. అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి దేవర అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేయగా అనుకున్న దానికన్నా ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. దాని వల్ల ఫ్యాన్స్ అంతా చాలా నిరుత్సాహ పడ్డారు. మరి ఈ ఎఫెక్ట్ దేవర మీద ఎలా పడుతుందో చూడాలి.
Also Read : Pawan Kalyan : హీరో కార్తీని అభినందించిన పవన్ కళ్యాణ్ ..