Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్.. మామూలుగా లేదుగా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న
- Author : Anshu
Date : 09-12-2022 - 8:41 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సాంగులకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటిక ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాకుండా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉండడంతో హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి సంక్రాంతి కానుకగా జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాలో రవితేజ ఎలా ఉండబోతున్నాడు ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక సూపర్ అప్డేట్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
అబ్బాయిలూ, మాస్ ట్రీట్ కి రెడీ అయిపోండి.🤘👍
Mass Maharaja @RaviTeja_offl‘s first look teaser from our #WaltairVeerayya releasing on 12th Dec, 11.07 AM 🔥🔥🔥
Stay tuned 🤩🤩#WaltairVeerayyaOnJan13th ✅ https://t.co/XuarZPu5dI
— Bobby (@dirbobby) December 9, 2022
రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 12న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీ లుక్ సాలిడ్ గా ఉంది. ఓ చేతిలో మేక పిల్ల మరో చేతిలో గొడ్డలితో గ్యాస్ సిలిండర్ ను లాక్కొస్తున్న స్టిన్నింగ్ విజువల్ రివీల్ చేశారు. దీంతో ఈ సినిమాలో రవితేజ లుక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.