Kannappa Movie Talk: కన్నప్ప మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే!
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే పలు ప్రాంతాల్లో విడుదలైంది. కాగా ఇప్పటికే ప్రిమియర్స్ పడిపోయాయి. ఈ సినిమాను చూసిన కొందరు ‘ఎక్స్’లో ‘కన్నప్ప’ చూడదగిన చిత్రమని చెబుతున్నారు.
- By Gopichand Published Date - 08:56 AM, Fri - 27 June 25

Kannappa Movie Talk: ‘కన్నప్ప’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముఖ్యంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే యూఎస్‌లో మొదలైన ప్రీమియర్స్ చూసినవారు సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెబుతున్నారు.
మూవీకి ప్లస్‌గా ప్రభాస్ నటన
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే పలు ప్రాంతాల్లో విడుదలైంది. కాగా ఇప్పటికే ప్రిమియర్స్ పడిపోయాయి. ఈ సినిమాను చూసిన కొందరు ‘ఎక్స్’లో ‘కన్నప్ప’ చూడదగిన చిత్రమని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయినా.. సెకండ్ హాఫ్ మూవీని నిలబెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు, రుద్రగా ప్రభాస్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. మరీ ఈ సినిమా హిట్టో? ఫట్టో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.
Also Read: Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?
#ManchuVishnu Anna Hit Kotesamm Final gaa 😭😭😭🔥
Every Where Positive Talk 💥💥
9 Years Taravata Okaa manchii Hit Kotavv Adhii Kuda #Prabhas Anna Cameo Tho 💥🔥#KannappaMovie#Kannappapic.twitter.com/9hsLToVTKk— 𝐑𝐚𝐡𝐮𝐥 𝐑𝐚𝐢𝐬𝐚𝐚𝐫 🏌🏻 (@devarata_raisar) June 26, 2025
మంచు విష్ణు ఎమోషనల్
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన కన్నప్ప నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. చిత్ర ప్రీమియర్స్‌కు పాజిటివ్ స్పందన రావడంపై హీరో విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ క్షణం కోసం జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్, ఇండియాలో ప్రీమియర్స్‌కు వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ చూపుతోన్న ప్రేమను చూస్తోంటే నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ‘కన్నప్ప’ నా సినిమా కాదు.. ఈ క్షణం నుంచి మీ సినిమా’’ అని ట్వీట్ చేశారు.
This moment… I’ve waited for it my entire life.
Hearing the overwhelming love pouring in from overseas premieres and early morning shows in India fills my heart with gratitude.🙏#Kannappa is no longer just my film—it’s yours now.🙏❤️ #HarHarMahadev pic.twitter.com/BUOZA3tgOQ— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2025
ఈ మూవీకి బుక్ మై షోలో 24 గంటల్లో 1,15,000 టికెట్లు అమ్ముడవడం, ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో రిలీజ్ అవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచుకునే అనుమతి ఇచ్చిన (సింగిల్ స్క్రీన్‌లో రూ.206.50, మల్టీప్లెక్స్‌లో రూ.236 వరకు) విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు రూ. 4.5 కోట్ల రేంజ్‌లో ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో డే 1 కలెక్షన్స్ 4.5-5 కోట్ల రేంజ్‌లో, పాజిటివ్ టాక్ వస్తే వరల్డ్‌వైడ్‌గా 14-16 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ పేర్కొంది.