Manchu Vishnu: వివాదంపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. మోహన్‌బాబు ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విష్ణు సన్నిహితులు విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది.
- By Gopichand Published Date - 10:59 AM, Tue - 10 December 24

Manchu Vishnu: మంచు ఫ్యామిలీ వివాదంపై తాజాగా మోహన్ బాబు పెద్ద కొడుకు, మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన తాజాగా ఈ విషయంపై నోరు విప్పారు. తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు. తమ ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదని హితవు పలికారు. త్వరలోనే తమ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అయితే దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి జల్‌పల్లిలోని ఇంటికి చేరుకున్నారు.
మోహన్ బాబు ఇంటి వద్ద బందోబస్తు
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. మోహన్‌బాబు ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విష్ణు సన్నిహితులు విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. ఇదే సమయంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విష్ణు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Dec 10th : అంతర్జాతీయ జంతు హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..?
మంచు ఫ్యామిలీ వివాదంపై స్పందించిన విష్ణు#vishnu #manchumanoj #mohanbabu #tollywood pic.twitter.com/tpajFjVO8j
— Gopichand (@GThanuru) December 10, 2024
ఇకపోతే ఇప్పటికే పోటాపోటీగా మంచు మనోజ్‌పై మోహన్ బాబు రాచకొండ కమిషనర్‌లో ఫిర్యాదు చేయగా.. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మనోజ్ గుర్తుతెలియని 10 మంది వ్యక్తులు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు తండ్రి కొడుకుల మధ్య తారాస్థాయికి ఎందుకు చేరింది? అనే ప్రశ్నలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విష్ణు రాకతో ఈ సమస్య మరింత పెద్దది అవుతుందా? లేకపోతే సెటిల్ అవుతుందా అని మంచు అభిమానులతో పాటు సినీ పెద్దలు సైతం ఎదురుచూస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆస్తి వ్యవహారంలో మనోజ్‌కు మోహన్ బాబకు మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు యూనివర్శిటీలో అన్యాయం జరుగుతుందని మనోజ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు మనోజ్‌ను అతని భార్య మౌనికను తన ఆస్తుల నుంచి వారి పేరును తొలగించాలని మోహన్ బాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా సరే మంచు లక్ష్మీ సైతం మౌనంగా ఉండటంతో సర్వత్రా ఇదే విషయమై చర్చ నడుస్తోంది.