Manchu Vishnu Kannappa First Look : కన్నప్ప ఫస్ట్ లుక్.. మంచు విష్ణు అదరగొట్టేశాడు..!
Manchu Vishnu Kannappa First Look మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. భక్త కన్నప్ప కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో
- Author : Ramesh
Date : 08-03-2024 - 5:52 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Vishnu Kannappa First Look మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. భక్త కన్నప్ప కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక క్యామియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలా చాలా పెద్ద తారాగణమే ఉంటుందని తెలుస్తుంది.
మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. విల్లు ఎక్కుపెట్టి కన్నప్పగా మంచు విష్ణు ప్రొఫైల్ లుక్ అదిరిపోయింది. కన్నప్ప కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మంచు విష్ణు ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది.
మంచు విష్ణు కెరీర్ లో భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాగా కన్నప్ప వస్తుంది. ఈ సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమాను దసరా బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
Also Read : Shivratri Fasting Foods : శివరాత్రి ఉపవాసం పూర్తయ్యాక వీటిని అల్పాహారంగా తినొచ్చు..