Manchu Manoj-Mounika: మంచు మనోజ్, భూమా మౌనిక మ్యారేజ్ ఫిక్స్.. ఎప్పుడంటే!
మంచు మనోజ్(Manchu Manoj), మౌనిక రెడ్డి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
- By Balu J Published Date - 04:22 PM, Sat - 25 February 23

ఎట్టకేలకు మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటారనే వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయింది. మంచు మనోజ్(Manchu Manoj), మౌనిక రెడ్డి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 3 న తేదీని నిర్ణయించారు. మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇటీవల ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించింది.
మనోజ్, అతని మునుపటి భార్య కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. అదే విధంగా, మౌనిక రెడ్డి కూడా తన భర్తకు విడాకులు ఇచ్చారు. మనోజ్, మౌనిక ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. వారి భాగస్వాముల నుండి విడిపోయిన తర్వాత ప్రేమ (Love)లో పడ్డారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. చాలా సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉన్న మనోజ్ (Manchu Manoj) ఇటీవల ఒక సినిమా ప్రాజెక్ట్ ను ప్రకటించాడు.
Also Read: Congress Plenary Session: ప్రియాంకపై గులాబీల వర్షం.. 6వేల టన్నుల గులాబీలతో గ్రాండ్ వెల్ కం!