Shine Tom Chacko : పోలీసులను చూసి దసరా నటుడు పరార్..? చేసిన తప్పు అదేనా..?
Shine Tom Chacko : కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం మీద ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించారు
- By Sudheer Published Date - 09:19 PM, Thu - 17 April 25

ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో డ్రగ్స్ కల్చర్ (Drug Culture) తీవ్రంగా పెరిగిపోతుండటంతో, పోలీసులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం మీద ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో హోటల్‌లో ఉన్న ప్రముఖ మలయాళ నటుడు, ‘దసరా’ చిత్రంలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో (Shine Tom Chacko), మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి పరార్ అయ్యాడు. ఈ ఘటన హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డై, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Life On Distant Planet: ఆ గ్రహంపైనా జీవరాశులు.. ఆధారాలు గుర్తించిన సైంటిస్టులు
పోలీసుల ప్రకారం.. డ్రగ్స్ కేసులో షైన్ ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో, గతంలో మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ చేసిన ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఆమె మాటల్లో, డ్రగ్స్ తీసుకుని షైన్ తాను ఎదుర్కొనాల్సిన అసభ్యమైన పరిస్థితులు, ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని చెప్పిన విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన షైన్ టామ్ చాకో, నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘దసరా’, ‘రంగబలి’, ‘దాకు మహారాజ్’, ‘దేవర’, ‘రాబిన్ హుడ్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజా డ్రగ్స్ కేసు వల్ల ఆయన కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న చర్చ మళ్లీ మొదలైంది.