Karthikeya Bhaje Vayu Vegam : మహేష్ వదిలిన బాణం.. భజే వాయు వేగం..!
Karthikeya Bhaje Vayu Vegam RX 100 హీరో కార్తికేయ లాస్ట్ ఇయర్ బెదులంక 2012 సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. కొత్త కథలతో కార్తికేయ చేస్తున్న ప్రయత్నాలు చాల వరకు ఫెయిల్యూర్ అవుతున్నా కార్తికేయ మాత్రం అలాంటి ప్రయోగాలు చేయడం
- Author : Ramesh
Date : 12-04-2024 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
Karthikeya Bhaje Vayu Vegam RX 100 హీరో కార్తికేయ లాస్ట్ ఇయర్ బెదులంక 2012 సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. కొత్త కథలతో కార్తికేయ చేస్తున్న ప్రయత్నాలు చాల వరకు ఫెయిల్యూర్ అవుతున్నా కార్తికేయ మాత్రం అలాంటి ప్రయోగాలు చేయడం మానట్లేదు. బెదులంక సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో మరోసారి తన దూకుడు చూపించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భజే వాయు వేగం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ టైటిల్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ మోడ్ లో ఉన్న మహేష్ తన సోషల్ మీడియా ద్వారా భజే వాయు వేగం ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Raviteja Nani : కొత్త భామ వెంట పడుతున్న హీరోలు..!
ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే చేతిలో బ్యాటు పక్కన కరెన్సీ నోట్లతో కార్తికేయ డిఫరెంట్ ఆ కనిపిస్తున్నాడు. మరి కార్తికేయ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. యువ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో సక్సెస్ ఫెయిల్యూర్ లను లెక్క చేయకుండా తన ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్న కార్తికేయకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
యువి క్రియేషన్స్ ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే మరోపక్క కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో యంగ్ హీరోలతో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు. మీడియం రేంజ్ బడ్జెట్ తో సరైన కథ తో వస్తే వాటితో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చని ఈమధ్య కొన్ని సినిమాలు చూపిస్తున్నాయి. అందుకే యువి బ్యానర్ అటు స్టార్స్ తో ఇటు యువ హీరోలతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
Interesting first look and title #BhajeVaayuVegam 👍
Wishing @ActorKartikeya, @Dir_Prashant and the entire team all the success! pic.twitter.com/Na6AFtWX1E
— Mahesh Babu (@urstrulyMahesh) April 12, 2024