Guntur Karam : 40 నిమిషాలు మాస్ విధ్వంసం.. గుంటూరు కారంపై అంచనాలు పెంచిన నిర్మాత..!
Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను హారిక
- By Ramesh Published Date - 12:09 PM, Wed - 3 January 24

Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాత చిన బాబే అయినా ప్రమోషన్స్ లో మాత్రం సూర్యదేవరగ నాగ వంశీ పాల్గొంటున్నారు. గుంటూరు కారం సినిమాపై మాక్సిమం అంచనాలను పెంచేస్తున్నారు నాగ వంశీ.
We’re now on WhatsApp : Click to Join
ఈ క్రమం లో లేటెస్ట్ గా సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని సినిమా మొత్తం లో 40 నిమిషాల ఊర మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాయని అంటున్నారు. సినిమాలో అన్ని అంశాలు అద్భుతంగా సెట్ అయ్యాయని సినిమా త్రివిక్రం మార్క్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలు ఉంటాయని చెబుతున్నారు.
నాగ వంశీ కామెంట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన 3 సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మహేష్ హిట్ మేనియాని కొనసాగించేలా గుంటూరు కారం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మరి సంక్రాంతికి అసలు సిసలైన సూపర్ హిట్ సూపర్ స్టార్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Mrunal Thakur : ఒకే హీరోతో రెండు సినిమాలు.. మృణాల్ ఫాం ఈ రేంజ్ లోనా..!