Mrunal Thakur : ఒకే హీరోతో రెండు సినిమాలు.. మృణాల్ ఫాం ఈ రేంజ్ లోనా..!
Mrunal Thakur డ్యాన్సర్ కం డైరెక్టర్ కం యాక్టర్ లారెన్స్ ఏదో ఒక విధంగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు
- By Ramesh Published Date - 11:21 AM, Wed - 3 January 24
Mrunal Thakur డ్యాన్సర్ కం డైరెక్టర్ కం యాక్టర్ లారెన్స్ ఏదో ఒక విధంగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. ఈమధ్య డైరెక్షన్ కి కాస గ్యాప్ ఇచ్చిన లారెన్స్ యాక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు. లారెన్స్ హీరోగా ఈమధ్య వరుస సినిమాలు వస్తున్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలైతే చేస్తున్నారు. ఈమధ్యనే జిగరు తండ డబుల్ ఎక్స్ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న లారెన్స్ ఆ సినిమా తర్వాత రెండు సినిమాలను చేస్తున్నట్టు తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఫిక్స్ చేశారట. తెలుగులో మృణాల్ ఠాకూర్ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమాను డైరెక్ట్ చేసిన రవికుమార్ డైరెక్షన్ లో లారెన్స్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
ఈ సినిమాతో పాటుగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కే ఒక సినిమాలో కూడా లారెన్స్ తో మృణాల్ జోడీ కడుతుంది. ఒకేసారి రెండు సినిమాలు ఒకే హీరోతో చేస్తుంది మృణాల్ ఠాకూర్. కచ్చితంగా ఈ సినిమాలతో అమ్మడు కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. ఆల్రెడీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అదరగొడుతున్న మృణాల్ కోలీవుడ్ లో కూడా తన హిట్ ఫాం కొనసాగించాలని చూస్తుంది.
Also Read : Bellamkonda Srinivas : బెల్లంకొండ సినిమాకు వెరైటీ టైటిల్.. పవన్ వద్దనుకున్నా అతను కావాలన్నాడు..!
Related News
CSK vs RCB IPL : నేటి ఐపిఎల్ మ్యాచ్ లో ఇండియన్ 2 టీం.. కమల్ తో పాటు శంకర్ కూడా..!
CSK vs RCB IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. అయితే నేడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనుంది.