Mahesh Babu Remuneration: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన మహేశ్, ఒక్క సినిమాకు అన్ని కోట్లా!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు మహేశ్.
- Author : Balu J
Date : 02-05-2023 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
మహేష్ బాబు (Mahesh Babu) నిస్సందేహంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. రెండు దశాబ్దాల కెరీర్‌లో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ త్రివిక్రమ్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ రెమ్యూనరేషన్ (salary) టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
మహేశ్ లేటెస్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన SSMB28. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ప్రాజెక్ట్ కోసం మహేశ్ భారీగా రెమ్యూనరేషన్ (పారితోషికం) తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేశ్ కు ప్యాన్-ఇండియా అప్పీల్ లేకున్నప్పటికీ ఆ స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం 70 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. SS రాజమౌళి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం SSMB29 కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా 110 కోట్లకు పెంచేసినట్టు సమాచారం! ఈ భారీ పారితోషికంతో, మహేష్ బాబు అల్లు అర్జున్, ప్రభాస్‌లతో కలిసి టాలీవుడ్ 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు.
మహేశ్ (Mahesh Babu) సినిమాలు ఎల్లప్పుడూ బాక్సాఫీస్ స్మాష్‌గా ఉంటాయి. కానీ, అతని రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. యావరేజ్ మూవీకి కూడా భారీగా కలెక్షన్లు సాధింగల నటుడు ఆయన. అందుకే మహేశ్ కు క్రేజ్ ఉంది. ప్రస్తుతం చేయబోయే సినిమాలు ప్రతిష్టాత్మకమైనవి కావడంతో మహేశ్ రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Also Read: Pawan Kalyan: నేను విన్నాను.. నేను చూశాను, పంట నష్టంపై పవన్ రియాక్షన్!