Mahesh Babu : అంబానీ పెళ్లి వేడుకకు మహేష్ బాబు.. ఏపీ నుంచి వారుకూడా..
రామ్ చరణ్ తో పాటు అంబానీ పెళ్లి వేడుకకు మహేష్ బాబు కూడా పయనం. అలాగే ఏపీ నుంచి వారుకూడా..
- By News Desk Published Date - 02:01 PM, Fri - 12 July 24

Mahesh Babu : అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ప్రపంచంలో ఎప్పుడు జరగనంత అంగరంగ వైభవంగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అంటూ రెండు సార్లు నిర్వహించిన అంబానీ కుటుంబసభ్యులు.. ఆ వేడుకలకు ప్రపంచంలోని పలువురు సెలబ్రిటీస్ ని ఆహ్వానించారు. ఇక నేడు పెళ్లి వేడుక ఘనంగా జరగబోతుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. ఇక ఈ వివాహానికి కూడా ప్రపంచంలోని అతిరథమహారధులు కదిలి వస్తున్నారు.
క్రీడా, రాజకీయ, బిజినెస్ రంగంలోని ముఖ్య ప్రముఖులతో పాటు సినిమా రంగానికి చెందిన వారు కూడా వస్తున్నారు. ఈక్రమంలోనే హాలీవుడ్ టు బాలీవుడ్ పలువురు ప్రముఖులు వెడ్డింగ్ ఈవెంట్ కి చేరుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఆల్రెడీ వెడ్డింగ్ ఈవెంట్ వద్దకి చేరుకున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ముంబై బయలుదేరారు. తన సతీమణి నమ్రతతో కలిసి మహేష్.. అంబానీ పెళ్లి వేడుకకు బయలుదేరారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని మహేష్ బాబు విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మహేష్ లుక్స్ వావ్ అనిపిస్తున్నాయి. లాంగ్ హెయిర్ తో టోపీ పెట్టుకొని, టి షర్ట్ లో యంగ్ లుక్ కనిపిస్తున్నారు. మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని రాజమౌళితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని లుక్ కోసమే మహేష్ లాంగ్ హెయిర్ పెంచుతున్నట్లు తెలుస్తుంది.
Superstar #MaheshBabu departs mumbai for #anantambaniwedding @urstrulyMahesh pic.twitter.com/FTKC2RZLnN
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 12, 2024
ఇక అంబానీ వివాహ ఆహ్వాన విషయానికి వస్తే.. ఇప్పటివరకు రామ్ చరణ్ అండ్ మహేష్ బాబుకి మాత్రమే వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. వీరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కి కూడా ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు అంబానీ పెళ్లి వేడుకకు వెళ్ళబోతున్నారో చూడాలి.