Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రమైన ‘#SSMB29’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
- By Kavya Krishna Published Date - 03:24 PM, Sun - 31 August 25

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రమైన ‘#SSMB29’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్ కారణంగా మహేశ్ షెడ్యూల్ చాలా హెక్టిక్‌గా మారింది. ఈ క్రమంలో తనయుడు గౌతమ్ జన్మదిన వేడుకలకు ఆయన హాజరు కాలేకపోయారు. తన బిజీ షెడ్యూల్ వల్ల కొడుకుతో గడపలేకపోవడం మహేశ్‌ను భావోద్వేగానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. గౌతమ్ చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ “ఈ బర్త్‌డేకి నిన్ను మిస్ అవుతున్నా” అని హృదయపూర్వకమైన క్యాప్షన్ జోడించారు. మహేశ్ తనయుడు 19వ ఏట అడుగుపెట్టిన సందర్భంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ‘‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అని ఆశీర్వదించారు. ఈ పోస్ట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు గౌతమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే
మహేశ్ వ్యక్తిగత జీవితానికి, ఆయన కుటుంబానికి అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. కాబట్టి గౌతమ్ పుట్టినరోజున ఆయన లేకపోవడం వారిని కూడా కాస్త భావోద్వేగానికి గురి చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా మహేశ్ బాబు తన కొడుకుపై చూపించిన ప్రేమ, మమకారం అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాకి వస్తే, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#SSMB29’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ సినీ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మరియు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ టెక్నికల్ టీమ్ సహకారంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025