Mahesh Babu Abhibus : మహేష్ అభి బస్ కొత్త యాడ్ చూశారా.. డైరెక్టర్ ఎవరంటే..?
Mahesh Babu Abhibus సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సూపర్ స్టార్ మహేష్ మరోపక్క వాణిజ్య ప్రకటనలకు కూడా టైం కేటాయిస్తాడు. అలా వచ్చిన డబ్బులతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్
- By Ramesh Published Date - 09:55 AM, Fri - 26 April 24

Mahesh Babu Abhibus సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సూపర్ స్టార్ మహేష్ మరోపక్క వాణిజ్య ప్రకటనలకు కూడా టైం కేటాయిస్తాడు. అలా వచ్చిన డబ్బులతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కు ఉపయోగిస్తుంటాడు. మహేష్ ఇప్పటికే 1500 మంది చిన్నారులకు ప్రాణదాతగా నిలిచాడు.
లేటెస్ట్ గా మహేష్ అభి బస్ కొత్త యాడ్ లో మెరిశాడు. అభి బస్ తో కొన్నాళ్లుగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మహేష్ దీనికోసం కొత్త యాడ్ లో కనిపించాడు. ఈ యాడ్స్ ను ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు మహేష్, రాజేంద్ర ప్రసాద్ కాంబోని రిపీట్ చేస్తూ కొత్త అభిబస్ బాడ్ చేశారు.
అభి బస్ కొత్త యాడ్ లేటెస్ట్ గా రిలీజై ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. సో అలా మరోసారి అనీల్ రావిపుడి డైరెక్షన్లో మహేష్ నటించాడన్నమాట. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి నాడు లాంచ్ చేస్తారని టాక్. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా సినిమా అందరి అంచనాలను మించి ఉంటుందని ఫిక్స్ అయ్యారు.