Aishwarya Rai: ఆ డైరెక్టర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా: ఐశ్వర్యా రాయ్
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది ఐశ్వర్యా రాయ్.
- By Balu J Published Date - 05:37 PM, Mon - 24 April 23

వన్నె తరగని అందంతో బాలీవుడ్ (Bollwood) బ్యూటీ ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) మెస్మరైజ్ చేస్తోంది. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు మనసుకు నచ్చిన సినిమాలను చేస్తోంది. తమిళంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ టాలీవుడ్ మీడియాతో చిట్ చాట్ చేసింది. ‘‘పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
ఏప్రిల్ 28న మీ అందరినీ థియేటర్స్‌లో కలుస్తాం. మణిరత్నం (Mani Ratnam)గారికి థాంక్స్. ఆయనతో ఇరువర్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది టీమ్‌తో పని చేసే అదృష్టం కలిగింది. నిర్మాత సుభాస్కరన్‌గారు అందించిన తిరుగులేని సపోర్ట్‌తో గొప్ప మ్యాజికల్ ప్రంచాన్ని క్రియేట్ చేయగలిగాం. గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. చాలా కష్టపడి చేశాం. ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు’’ (Aishwarya Rai) అన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.
Also Read: Viveka Murder Case: వర్మ ‘నిజం’లో వివేకా హత్య!