Kumari Aunty : స్టార్ మా స్పెషల్ ఈవెంట్ కు ‘కుమారి ఆంటీ ‘ స్పెషల్ గెస్ట్..
- By Sudheer Published Date - 12:39 PM, Wed - 7 February 24

ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి అనే మహిళ ఇప్పుడు కుమారి ఆంటీ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో కొనసాగుతున్నారు. మాములు నెటిజన్ దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత కుమారి ఆంటీ పేరు జపం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు స్టార్లు అవుతారో..చెప్పలేని పరిస్థితి. తాజాగా కుమారి ఆంటీ కూడా అలాగే ఇప్పుడు ఫేమస్ అయ్యింది.
హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు..మెను కార్డు నుండి ప్రతిదీ కవర్ చేస్తూ వైరల్ చేసారు. ఇంకేముంది ఒక్కసారైనా కుమారి అంటి భోజనం రుచి చూడాలని ప్రతి ఒక్కరు భవిస్తూ..ఆమె హోటల్ వద్ద క్యూ కడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు స్టార్ మా సైతం కుమారి ఆంటీ క్రేజ్ ను వాడుకోవాలని చూస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ అయ్యారు. ‘బిగ్‌బాస్ ఉత్సవం’ పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను స్టార్ మా ప్లాన్ చేయగా.. ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ బిగ్‌బాస్ ఉత్సవం షోకు కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. అంతేకాదు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు కుమారి ఆంటీ తన వంటల టాలెంట్‌ను రుచి చూపించారు. కుమారి ఆంటీ నాన్ వెజ్ భోజనంకు కంటెస్టెంట్స్ అందరూ ఫిదా అయ్యారట.
కుమారి వడ్డించిన భోజనం తింటూ కంటెస్టెంట్స్ అంత సరదాగా గడిపారు. ఇందుకుసంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుమారి ఆంటీతో స్టార్ మా నిర్వహకులు ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఉత్సవం షో త్వరలో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Read Also : Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం